![]() |
![]() |
.webp)
బుల్లితెర మీద విష్ణుప్రియ కనిపిస్తే చాలు విపరీతమైన నవ్వు ముంచుకొస్తుంది. ఇక ఈమె జోడి ప్రిథ్వి శెట్టి వీళ్ళిద్దరూ కలిస్తే ఆడియన్స్ కి పండగే పండగా. అలాంటి విష్ణు ప్రియా ఒక ఇంటర్వ్యూలో పెళ్లి గురించి చెప్పుకొచ్చింది. "నీకు నచ్చే హజ్బెండ్ కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి" అనేసరికి "ఈషా మెడిటేటర్ అయ్యి ఉండాలి..వేదాలు గురించి తెలిసి ఉండాలి, డాన్స్, సింగింగ్ వస్తే ఇంకా మంచిది, కుకింగ్ కూడా వచ్చి ఉండాలి, అట్లీస్ట్ బేసిక్స్ అన్నా అంటే అన్నం, పప్పు అన్నా చేయగలగాలి." అని చెప్పింది విష్ణు ప్రియా. ఇక హోస్ట్ ఐతే "వస్తాడా ఈ క్వాలిటీస్ ఉన్న అబ్బాయి" అని అడిగింది. "అంటే వస్తే చేసుకుంటా లేదంటే సన్యాసం పుచ్చుకోవడానికి నేను రెడీగా ఉన్నాను" అని చెప్పింది.
"నచ్చిన అబ్బాయి రాకపోతే సన్యాసంలోకి వెళ్ళిపోతావా" అని అడిగింది హోస్ట్. "అవును నేను ఎప్పుడూ అదే ఆలోచించుకుంటూ ఉంటా. 50 , 58 వచ్చేసరికి నేను హరే రామ హరే కృష్ణ అనుకుంటూ నేను గుండుతో తులసి మాల వేసుకుని భగవద్గీత గురించి చెప్తూ ఉండాలి అనుకుంటూ ఉంటాను, లేదంటే కాశీకి వెళ్లి అక్కడ అలా భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉండిపోదామా అనుకుంటూ ఉంటాను." అని చెప్పింది. "విష్ణు నువ్వు ఇలా చేంజ్ ఐపోవడానికి కారణాలు ఏమిటి" అని హోస్ట్ అడిగింది. "చిన్నప్పటి నుంచి కృష్ణుడి ఆశీస్సులు నాతోనే ఉన్నాయనుకుంటాను. నేను ఉన్న హాస్టల్ లో భగవద్గీత ఒక సబ్జెక్టు. అలా నాకు భగవద్గీత నోటికి వచ్చేసింది. దేవుడు నిన్ను భూమిలోకి పాతేసి తర్వాత నిన్ను నెమ్మదిగా పైకి తీసుకొస్తాడు అని చెప్తూ ఒక భగవద్గీతా శ్లోకం కూడా చెప్పేసింది." ఇక హోస్ట్ ఐతే ఆ శ్లోకం విని "తర్వాత నీకు ఏ దేవిశ్రీ ప్రసాద్ గారో ఫోన్ చేసి ఒక పాట పాడాలి విష్ణు అని చెప్తారు అంది. తర్వాత ఇక లింగాష్టకం, అయిగిరి నందిని భక్తి గీతాలు కూడా తనకు వచ్చు అని చెప్పింది. ఇక దేవుళ్ళే తన ఫామిలీ అని చెప్పింది.
![]() |
![]() |